Nammali - New Year Song - Nissy John

Nammali - New Year Song - Nissy John

నమ్మాలి దేవుని ప్రేమను
ప్రేమించాలి దేవుని వాక్యమును "2"
ప్రేమ యందు వేరు పారి స్థిరపడుము
ప్రేమ వెడల్పు పొడవు లోతు గ్రహియించుము
అగాపె ప్రేమ  అగాపె ప్రేమా....
అగాపె ప్రేమ యేసయ్యా ప్రేమ...." 2 "
                "  నమ్మాలి దేవుని  "

1) దేవుని ప్రేమను ఏరిగితే
బాధలు వ్యాధులు ఉండవు
దేవునితో సహవాసం చేస్తే
ఉన్నతముగా జీవింతువు " 2 "
మనకోసం తన ప్రేమ 
ముందుగా పరుగెత్తును
ఈ లోక ప్రేమ ఓడిపోయి వెనుతిరుగును " 2 "
అగాపె ప్రేమ  అగాపె ప్రేమా....
అగాపె ప్రేమ యేసయ్యా ప్రేమ...." 2 "
                "  నమ్మాలి దేవుని  "

2) శాశ్వతమైన ప్రేమతో
యేసయ్యా మనలను ప్రేమించెను
విడువక ఎడబాయక మన యెడల
కృపా కనికరము చూపెను " 2 "
దినదినము అభివృద్ధితో
తన ప్రేమతో పోషించును
అనుక్షణము ఆయువు పోసి
నూతన వాత్సల్యముతో  నింపును " 2 "
అగాపె ప్రేమ  అగాపె ప్రేమా....
అగాపె ప్రేమ యేసయ్యా ప్రేమ...." 2 "
                "  నమ్మాలి దేవుని  "

రచన : Sis.సగినాల. సంగీత డేవిడ్
స్వరకల్పన Bro. పడాల . సురేషబాబు
గానం  : Bro. నిస్సి జాన్
సంగీతం :Bro. రాజానంద్